Monday, May 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపుతిన్తో జిన్‌పింగ్‌ సమావేశం!

పుతిన్తో జిన్‌పింగ్‌ సమావేశం!

- Advertisement -

వాషింగ్టన్: హార్ముజ్ జలసంధిపై నియంత్రణ, ఇరాన్‌ అణు కార్యక్రమం అంశాలపై పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దీంతో ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ అంశంపై ట్రంప్‌ ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జినిపింగ్తో కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. వచ్చే వారం రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్తో జిన్‌పింగ్‌ సమావేశం కానున్నారు. ఇరాన్‌కు చైనా కీలక వ్యూహాత్మక భాగస్వామిగా ఉండటంతో పాటు హర్మూజ్‌ జలసంధి మార్గంలో జరిగే ఇంధన రవాణాపై బీజింగ్‌ అధికంగా ఆధారపడుతోంది. ఇదిలా ఉండగా, అమెరికా నౌకాదళం అమలు చేస్తున్న దిగ్బంధన చర్యల వల్ల ఇరాన్‌కు రోజుకు సుమారు 500 మిలియన్‌ డాలర్ల మేర నష్టం జరుగుతోందని ట్రంప్‌ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిపై ప్రస్తుతం అమెరికాకే పూర్తి నియంత్రణ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు పరిస్థితులను చక్కదిద్దేందుకు పాకిస్థాన్‌ కూడా దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్‌ నఖ్వీ తాజాగా టెహ్రాన్‌కు చేరుకుని చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు ఆ దేశ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌ కూడా ఇరాన్‌ పర్యటించారు. ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌, ప్రధాన చర్చల ప్రతినిధి మహమ్మద్‌ బాఘర్‌ ఘాలిబఫ్‌ తమ ప్రభుత్వం ప్రతిపాదించిన 14 అంశాల శాంతి ప్రణాళికను అంగీకరించకపోతే ఇతర మార్గాలన్నీ ఫలితం ఇవ్వవని హెచ్చరించారు. అలాగే హార్ముజ్‌ జలసంధిలో ప్రత్యేక మార్గం ద్వారా నౌకా రాకపోకలను నియంత్రించే ప్రొఫెషనల్‌ మెకానిజం అమలు చేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఇరాన్‌తో సహకరించే దేశాల వాణిజ్య నౌకలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతరులపై పరిమితులు కొనసాగుతాయని వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -