ఉద్యోగంలో బదిలీ సహజం

నవతెలంగాణ-ముత్తారం:
ఉద్యోగంలో బదిలీ సహజమని పలువురు అన్నారు. ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 11సంవత్సరాలు సేవలను అందించి బదిలీపై వెళ్తున్న చంద్రగిరి కమలకు బుధవారం ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు కలిసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా ర్థులు కష్టపడి చదువుకొని, బంగారు భవిష్యత్ కు  బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మౌనిక, సుజాత, అంజలి, రజిత, విజయలక్ష్మి, మనోలత, సంజీవరాణి, రజినీ, సునీత, సహేద బేగం, పుష్పలత, స్వరూప, లావణ్య, సునీత, సిబ్బంది లక్ష్మీ, రాజేశ్వరి, రమా దేవి, లావణ్య, అశ్విని, రాజేశ్వరి, సుహాసిని, శిరీష, పందుల లక్ష్మీ తదితరులున్నారు.
Spread the love