Tuesday, June 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నేత జోగ నర్సయ్య

ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నేత జోగ నర్సయ్య

- Advertisement -

 సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, మల్లు లక్ష్మి
భద్రాద్రి జిల్లా గుండాలలో స్మారక స్థూపం ఆవిష్కరణ

నవతెలంగాణ-గుండాల
రగిలే విప్లవ జ్వాల, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నేత జోగ నర్సయ్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మల్లు లక్ష్మి, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, అమరజీవి జోగ నర్సయ్య 5వ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం తూరుబాక గ్రామంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఆయన స్మారక స్థూపాన్ని పోతినేని సుదర్శన్‌రావు ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ(ఎం) జెండాను మల్లు లక్ష్మి ఎగురవేశారు. ఈ సందర్భంగా తోలెం గోపి అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని మాట్లాడుతూ.. జోగ నర్సయ్య చిన్ననాటి నుంచే విప్లవ భావాలు పుణికి పుచ్చుకుని చివరి శ్వాస వరకూ ఎర్రజెండా వదలని గొప్ప నాయకుడన్నారు. ఆయన మరణం పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని తెలిపారు. గుండాల మండలంలో ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి ప్రజలందరి మన్ననలు పొందారని కొనియాడారు. ఆదివాసీ విద్యార్థులకు సెల్ఫ్ మేనేజ్‌మెంట్ హాస్టల్ కోసం, ఓపెన్ కాస్టును వ్యతిరేకిస్తూ, పోడు భూముల పట్టాల కోసం, ప్రజల సమస్యలపై అఖిలపక్ష పార్టీలతో కలిసి అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. మార్క్సిజం, లెనినిజం ఆశయాల సాధనకు జీవితాంతం కృషి చేసిన మహానాయకుడని తెలిపారు. మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. జోగ నర్సయ్య మృతిపట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదప్రజల సమస్యలు ఉన్నంత కాలం ఎర్ర జెండా ఉంటుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -