
నవతెలంగాణ -బాల్కొండ(కమ్మర్ పల్లి) : భారత ప్రధాని నరేంద్ర మోడి పాలనకు ఆకర్శితులై పలువురు యువత బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపిలో చేరుతున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామానికి చెందిన 30 మంది వజ్ర యూత్ సభ్యులు బిజెపి బాల్కొండ మండల ఉపాధ్యక్షులు గంగారాజుల దేవేందర్, బిజెపి జిల్లా నాయకులు అనికేష్ రమేష్, గంగారాజుల దీపక్ గారి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. శుక్రవారం కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపిలోకి చేరుతున్న శుభసందర్భంగా మల్లికార్జున్ రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ఎంతో ప్రగతి సాధించింది అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, బాల్కొండ ఐటీ సెల్ కన్వీనర్ సక్కు, కొమ్ముల సంతోష్ రెడ్డి, బిజెపి నాయకులు, వజ్ర యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.