జీ.ఓ నెంబర్ 58, 59 దరఖాస్తుల పరిశీలన వేగవంతం..

– నాంపల్లి మండల తాహసిల్దార్ ఎం ప్రేమ్ కుమార్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
నాంపల్లి మండల పరిధిలో ప్రభుత్వ స్థలాలంలో ఇండ్లు కట్టుకున్న వారి కి జీ.ఓ 58, 59 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి స్థలాల వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నట్లు నాంపల్లి మండలం తహసీల్దార్  ఎం. ప్రేమ్ కుమార్ తెలిపారు. బుధవారం  నాంపల్లి మండల కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలను పరిశీలించి ధ్రువపత్రాలను జారీ చేస్తున్నామన్నారు. దరఖాస్తుదారులు మీ సేవ ద్వారా సర్టిఫికెట్లను పొందవచ్చని సూచించారు.  డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తుల విచారణ ప్రక్రియనుకూడ వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు, ధృవీకరణ పత్రాల జారీలో ఏలాంటి జాప్యం లేకుండాదరఖాస్తుదారుల కు ధృవీకరణ పత్రాలను జారీ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరణ విచారణ ప్రక్రియ  వేగవంతం చేశామని తెలిపారు.
Spread the love