కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్‌ లో చేరిక

నవతెలంగాణ- డిండి:  డిండి మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌ లోనికి మంగళవారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు. డిండి మండలం కందుకూరు గ్రామానికి చెందిన  50 కుటుంబాలు, రహమంతపురం గ్రామానికి చెందిన 50కుటుంబాలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.  పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీఆర్‌ఎస్‌ పార్టీ ద్వారానే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మాధవరం దేవేందర్ రావు, బిల్యానాయక్, వడ్త్య రమేష్ నాయక్, తూం నాగార్జునరెడ్డి, తూం వెంకటేశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పొనగంటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love