నవతెలంగాణ-బెజ్జంకి : మండల కేంద్రంతో పాటు బేగంపేట,రాంసాగర్, తలారివానిపల్లి గామాల్లోని పలువురు కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు అదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.మండల కేంద్రంలోని పార్టీ కార్యలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై బీఆర్ఎస్ పార్టీలో చేరిన అయా పార్టీల శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.