బల్దియా ఎదుట పాత్రికేయుల నిరసన

బల్దియా ఎదుట పాత్రికేయుల నిరసననవతెలంగాణ-వరంగల్‌
జనగామ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప రెడ్డి విలేకరుల పట్ల పరుష పదజాలం ఉపయోగించడంపై వెంటనే బేష రతుగా క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు బల్దియా కార్యాలయం ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆంగ్లపత్రిక విలేకరి మహేష్‌ బుధవారం జనగామలో రేవంత్‌ రెడ్డి బ హిరంగ సభకు కవరేజ్‌ నిమిత్తం వెళ్లారని తెలిపారు. సభానంతరం కొమ్మూరు ప్రతాపరెడ్డిని మర్యాద పూర్వకంగా ఉమ్మడి జిల్లా ప్రతినిధి కలవగా ఎటు వంటి సంభాషణ లేకపోవడంతో వెళ్తున్నా అని కొ మ్మూరు ప్రతాప్‌ రెడ్డికి చెప్పడంతో ఏంటి కోపంగా చూస్తున్నావ్‌ బెదిరిస్తున్నావా అంటూ ఆయన పరుష పదజాలాన్ని ఉపయోగించారని తెలిపారు. కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఉమ్మడి వరంగల్‌ జిల్లా మొత్తంలో ఉన్న పాత్రికేయులందరం కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని అన్నారు.

Spread the love