– మంత్రి, జెడ్పీ చైర్మన్‌లకు జర్నలిస్టుల వినతి
నవతెలంగాణ – ములుగు
ములుగు జిల్లాలో వివిధ అభివద్ధి కార్యక్ర మాలను ప్రారంభించడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాధోడ్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్‌కు ములుగు జర్నలిస్టులు యూనియన్‌లకు అతీతంగా శుక్రవారం వినతిపత్రం అందించారు. వివిధ దిన పత్రికలలో, వివిధ శాటిలైట్ టీవీ ఛానళ్లలో, పనిచే స్తున్న జర్నలిస్టులు బీపీఎల్‌లో గత కోన్ని సంవత్స రాలుగా జీవిస్తున్నమని మంత్రి సత్యవతి రాధోడ్ కు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ లకు వివరించారు. జిల్లా కేంద్రంలో గత 20 సంవత్సరాలుగా జర్నలి స్టుగా సేవలు అందిస్తున్నామని, తెలంగాణ ఉద్య మంలో వార్తలతో పాటు మావంతుగా ఉద్యమంలో చూరుకుగా పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. మంత్ర సత్యవతి మాట్లడూతూ జర్నలిస్టులు కోరిన న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని త్వరలోనే జిల్లాలోని జలిస్టులకు నివేషా స్థలాలతో పాటు ఇండ్ల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా జర్నలిస్టులు నర్ర రఘవీర్, గాదం దేవేందర్, గజ్జి రాజేష్, గుగ్గిల్ల సుజన్, కోరె అరవింద్, పోలోజు రామూర్తి, పోన్నాల స్వామి, ముకులోతు శరత్, తడుక హరిష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.