నవతెలంగాణ-హైదారాబాద్: ఇవాళ రాజ్యసభలో వక్ఫ్ బిల్లును కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. అ తర్వాత బిల్లుపై 8గంటలపాటు సభ్యులు చర్చించనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును కేంద్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. 12 గంటల పాటు అంటే అర్ధరాత్రి 12 వరకూ దీనిపై వాడీవేడీగా సభ్యుల మధ్య చర్చ సాగింది. ఆ తర్వాత ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేశారు. 232 మంది దీన్ని వ్యతిరేకించారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ బిల్లకు ఓటింగ్ ద్వారా ఆమోదం లభించింది. నేడు రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రాబోతోంది.