ఇప్పుడు అంతర్జాలం నిండా ఏఐ సష్టించిన చిత్రాలే. జపాన్ కార్టూన్ల శైలిలో ఉండే స్టుడియో జీబ్లీ స్టైల్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వాధినేతల నుంచి సామాన్యుల వరకు అందరిని ఇవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కత్రిమ మేధ వేదికగా పుట్టుకొస్తున్న కత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్‌గా మారుతున్నాయి. ఇప్పటి వరకైతే ఒక పోట్రేట్ గీయించుకోవాలంటే చేయి తిరిగిన ఆర్టిస్ట్ తో వేయించుకోవడమే అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే ఆన్‌లైన్‌లోనే ఆర్టిస్టులకు ఆర్డర్ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపిస్తున్నారు. ఇవన్నీ ఇప్పటి వరకు మనుషులు మాత్రమే చేశారు. కానీ కొన్ని రోజుల నుంచి జిబ్లీ ఏఐ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో యువతరం అంతా అటువైపు పరుగులు పెడుతున్నారు. ఓపెన్ ఏ1 సంస్థ తన చాట్ జీపీటీ-40 మోడల్‌లో ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను ఈ వేదికలో సబ్మిట్ చేసి క్షణాల్లో వారి జిబ్లీ ఫొటోలను పొంది.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఇదేం ట్రెండ్? దీన్ని ఎలా వాడుకోవాలి?
ఇమేజ్‌లను స్టుడియో జిబ్లీ స్టైల్‌లోకి మార్చుకునే అవకాశానికి ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచీ ఎంతోమంది జపాన్‌లో ఆదరణ పొందిన ఈ యానిమేషన్ శైలిలో ఇమేజ్‌లను తీర్చిదిద్దుకుంటున్నారు. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తన ప్రొఫైల్ పిక్చర్‌ను ఎక్స్‌లో జిబ్లీ స్టైల్ పొట్రెయిట్‌లోకి మార్చటంతో వీటి ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండ్ ప్రభావంతో చాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. కేవలం ఒక గంటలోనే 10 లక్షల మంది కొత్తగా చేరినట్లు ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. ఆయన ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ, ఈ విపరీతమైన వద్ధిని అద్భుతంగా పేర్కొన్నారు. శామ్ ఆల్ట్‌మన్ మరో ఆసక్తికర విషయాన్ని గుర్తుచేశారు. రెండు సంవత్సరాల క్రితం చాట్‌జీపీటీ మొదటిసారి విడుదలైనప్పుడు, 1 మిలియన్ (10 లక్షల) యూజర్లు చేరడానికి ఐదు రోజులు పట్టింది. కానీ ఇప్పుడు గంటలోనే 1 మిలియన్ యూజర్లు చేరడం అద్భుతమని అన్నారు.
పేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరిగిన తర్వాత.. వ్యక్తిగత ఫొటోలను వివిధ సందర్భాలను మిత్రులు, తెలిసినవారితో పంచుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిన విషయం విధితమే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫొటోలను చూసుకోవాలన్న కుతూహలం కూడా అంతే స్థాయిలో పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్ బండ్ పైనో, అలా శిల్పారామంలోనో పోట్రేట్ వేసే కళాకారులు ఉండేవారు. వారి వద్ద లైవ్‌గా వేయించుకునేవారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని.. వినూత్న, కళాత్మక యానిమేటెడ్ ఫొటోలు క్షణాల్లో వచ్చేస్తున్నారు. ఇంకేముంది.. వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవడం, పోస్ట్ చేసి షేర్ చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకు మినహాయింపు లేకుండా వాడేస్తున్నారు. ఐతే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్‌లో ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్రాక్‌లో ఇలా వాడుకోవాలి?
గ్రాక్ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి. లేదా ఎక్స్ యాప్‌లో నేరుగా గ్రాక్ గుర్తు మీద క్లిక్ చేయాలి.
గ్రాక్ పేజీ ఓపెన్ అయ్యాక అది గ్రాక్ 3 మోడల్ అవునో కాదో చూసుకోవాలి. స్టుడియో జీబ్లీ స్టైల్ గ్రాక్ 3 మోడల్‌లోనే అందుబాటులో ఉంటుంది.
అడుగున ఎడమ వైపున కనిపించే పేపర్ క్లిప్ గుర్తు మీద క్లిక్ చేసి, జీబ్లీ శైలిలో మార్చాలనుకునే ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయాలి. ఆ ఇమేజ్‌ను ‘జిబ్లీఫై’ చేయాలంటూ ప్రాంప్ట్‌ను టైప్ చేయాలి. అప్పుడు అప్‌లోడ్ చేసిన ఇమేజ్ స్టుడియో జీబ్లీ శైలిలోకి మారుతుంది. ఒకవేళ అది నచ్చకపోతే గ్రాక్‌లోనే ఎడిట్ చేసుకోవచ్చు కూడా.
చాట్‌జీపీటీలో ఇలా..
చాట్‌జీపీటీ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి. పేజీ పైభాగాన చాట్‌జీపీటీ మీద క్లిక్ చేసి, డ్రాప్‌డౌన్ మెనూలో చాట్‌జీపీటీ 4ఓను ఎంచుకోవాలి.
తర్వాత వెబ్‌సైట్‌లోనైతే ప్లస్ గుర్తు మీద, యాప్‌లోనైతే ఇమేజ్ గుర్తు మీద క్లిక్ చేయాలి. స్టుడియో జిబ్లీ స్టైల్‌లోకి మార్చుకోవాలనుకునే ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఆ ఫొటోను స్టుడియో జిబ్లీ స్టైల్‌లోకి మార్చాలంటూ ప్రాంప్ట్‌ను టైప్ చేయాలి. కొద్ది నిమిషాల తర్వాత కార్టూన్ శైలి ఇమేజ్ ప్రత్యక్షమవుతుంది.
‘జీబ్లీ’ ట్రెండ్ తో రిస్క్‌లో యూజర్ డేటా!
ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టినప్పటినుంచి ఈ సదుపాయాన్ని నెటిజన్లు తెగ వినియోగిస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ వెనుక ఓ చీకటి కోణం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూజర్లు జిబ్లీ ఆర్ట్ కోసం ఏఐ కంపెనీలకు షేర్ చేసిన సమాచారం గోప్యతకు భంగం కలుగుతోందని హెచ్చరిస్తున్నారు. డేటా ఉల్లంఘనలు, దుర్వినియోగానికి కూడా అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి కంపెనీలు పైకి హానిచేయనివిగా కనిపించినా- అవి అందించే సేవల వివరాలు అస్పష్టంగా ఉంటాయని అంటున్నారు. యూజర్లు షేర్ చేసిన ఫొటోలను ప్రాసెస్ చేసిన తర్వాత ఏం చేస్తారనే దానిపై ఏఐ కంపెనీలు స్పష్టత ఇవ్వడం లేదని హెచ్చరిస్తున్నారు.
చాలా ఏఐ ప్లాట్ ఫామ్‌లు ఇలాంటి ఆర్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. కానీ అందులో కొన్ని కంపెనీలు మాత్రమే తాము ఫోటోలను స్టోర్ చేయమని లేదా ఒకసారి ఉపయోగించిన తర్వాత వాటిని డిలీట్ చేస్తామని చెబుతున్నాయి. ఇలా చెబుతున్న చాలా కంపెనీల్లో అసలు డిలీట్ పాక్షికంగా చేస్తారా, వెంటనే చేస్తారా, లేకా ఆలస్యం అవుతుందా అనే విషయాలపై స్పష్టత ఇవ్వడం లేదు.
లొకేషన్ షేర్ అవుతుంది
యూజర్లు ఏఐ ప్లాట్ ఫామ్‌లతో షేర్ చేసుకునే ఫొటోలలో కేవలం మన ముఖం మాత్రమే కనిపించదని క్విక్ హీల్ టెక్నాలజీస్ సీఈఓ విశాల్ సాల్వి అంటున్నారు. దాంతో పాటు లొకేషన్ కోఆర్డినేట్‌లు, టైమ్‌స్టాంప్‌లు, డివైజ్ డీటైల్స్ వంటి మెటాడేటా కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. ఇవన్నీ నిశ్శబ్దంగా వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయగలవు. ఈ ఏఐ సాధనాలు న్యూరల్ స్టైల్ ట్రాన్స్‌ఫర్ (ఎన్‌ఎస్టీ) అల్గారిథమ్‌లను ప్రభావితం చేస్తాయి. ఈ అల్గారిథమ్ యుజర్లు షేర్ చేసిన ఫొటోలో ఉన్న ఆర్టిస్టిక్ స్టైల్ కంటెంట్‌ను వేరు చేస్తుంది. అనంతరం యూజర్ల ఫొటోలను రిఫరెన్స్ ఆర్ట్ వర్క్‌తో బ్లెండ్ చేస్తుంది. ఈ ప్రక్రియ మన డేటాకు హానికరంగా అనిపించకపోయినా, మోడల్ ఇన్వర్షన్ అటాక్‌లు జరిగే అవకాశం ఉంది. ఇవి చాలా ప్రమాదకరం. వీటి వల్ల జిబ్లీ చిత్రాల నుంచి అసలు ఫొటోలను మళ్లీ తీసుకురావచ్చు అని క్విక్ హీల్ టెక్నాలజీస్ సీఈఓ అంటున్నారు.
మీ డేటాను ఇలా కాపాడుకోండి
కొన్ని దేశాలు డేటా దుర్వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాయి. మరికొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ఇలా ఏఐ యాప్‌లతో వ్యక్తిగత ఫొటోలను పంచుకునేటప్పుడు యూజర్లు సూచిస్తున్నారు. అలాగే నియంత్రణ సంస్థలు గోప్యతా ధవీకరణ, ప్రామాణిక ఆడిట్‌లను తప్పనిసరి చేయాలని నిపుణులు చెబుతున్నారు.
– బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం
– ట్యూ ఫ్యాక్టర్ అథెంటికేషన్
– ఫిషింగ్ వెబ్ సైట్లకు దూరంగా ఉండటం
– ఫొటోలను అప్‌లోడ్ చేసే ముందు వాటి నుంచి మెటాడేటా తొలగించడానికి ప్రత్యేక టూల్స్ ఉపయోగించడం వంటివి చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417