జుక్కల్ హరిజనవాడలో 12 లక్షలతో నీటి సమస్య పరిష్కరించిన ఎమ్మేలే..

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని హరిజన వాడలో నెల కొన్న తీవ్ర నీటి ఎద్గడికి స్థానిక ఎమ్మెలే హన్మంత్ షిండే చోరవతో రూపాయలు పన్నేండు లక్షల రూపాయలను మంజూరు చేయడం జర్గిందని స్థానిక ప్రజాప్రతి నిధులు తెలిపారు. ఈ సంధర్భంగా బుదువారం నాడు హరిజన కాలనీలో బోరుబావీ తవ్వకం పనులను ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించి బోరుతవ్వకం ప్రారంబించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతు ఎస్సీ కాలనీలో ఐదువేల లీటర్ల సామార్థ్యం కల్గిన వాటర్ ప్లాస్టిక్ ట్యాంకులను మూడూ చోట్ల ఏర్పాటు చేయడం జర్గుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో విండో చైర్మేన్ శివానంద్, మాజీ మార్కేట్ చైర్మేన్ సాయాగౌడ్, వార్డు సబ్యుడు నాగ్ నాథ్, బీఆర్ఎస్ నాయకులు నీలుపటేల్, బొల్లి గంగాధర్, శీవాజీపటేల్, సురేష్, గంగారాం, శ్యాదుల్, సీతారం, రాము తదితరులు పాల్గోన్నారు.

Spread the love