ఇన్‌ఫ్లో లక్షా 56 వేల క్యూసెక్కులు
158794 క్యూసెక్కులు దిగువకు విడుదల
నవతెలంగాణ -ధరూర్
ధరూర్ మండల పరిధిలోని రేవులపల్లి గ్రామం వద్ద ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తినట్టు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1,56,400 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. వరద ఉధృతి నేపథ్యంలో ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తి లక్షా 25 వేల క్యూసెక్కులతో పాటు పవర్‌హౌస్ కు 34 వేలు, కాలువలకు కలిపి మొత్తం 1,58,794 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యామ్‌లో 8.631 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అదే విధంగా నెట్టెంపాడు 750, బీమా లిఫ్ట్ వన్ 1300, కోయిల సాగర్ 640 ,ఎడమ కాలువకు 840, కుడి కాలువకు 700, బీమా లిఫ్టు 2కు 872, ప్యానల్ కాలువకు 600 క్యూసెక్కులను వదులుతున్నామని పీజేపీ అధికారులు తెలిపారు.
జూరాల 27 గేట్లు ఎత్తివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



