తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో
ఆ దళాలదే కీలక పాత్ర : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గద్దర్ స్ఫూర్తితోనే అనేక సాంస్కృతిక దళాలు ఏర్పడ్డాయనీ, తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో ఆ దళాలు కీలక పాత్ర పోషించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గద్దర్ మూడో వర్థంతి సభ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో గద్దర్ స్మారక సభకు సంబంధించిన పోస్టర్‌ను కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దర్ ప్రజా యుద్ధ నౌక అనీ, తెలంగాణ ఉద్యమ సందర్భంలో తన ఆట, పాట, మాటతో పోరాటాన్ని, ఉద్యమకారులను తీవ్రంగా ప్రభావితం చేసి చైతన్య పరిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి జీవి సూర్య కిరణ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి పాల్గొన్నారు.
గద్దర్ స్ఫూర్తితోనే సాంస్కృతిక దళాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



