కొన్ని గంటలే.?

– నేటితో ముగియనున్న నామినేషన్లు
నవతెలంగాణ-మల్హర్ రావు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికీవ్ ఈ రోజు శుక్రవారం లాస్ట్ చాన్స్ నామినేషన్ల దాఖలుకు మరికొన్ని గంటలే మిగిలివుంది.శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలతో ఈ ప్రక్రియ ముగియనుంది.బిపామ్ లు తీసుకున్న పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు నామినేషన్ వేయడానికి ఇంకా కొన్ని గంటలు గడువు ఉంది.మంథని నియోజకవర్గంలో పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఒక ట్రెండ్ తోపాటు కొందరు డమ్మీ నామినేషన్ వేయగా,మరికొందరు ఈ రోజు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
జాగ్రత్తగా…
మంథని నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,బిఆర్ఎస్,బిజెపి,బిఎస్పీ తోపాటు పలు పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు.కొంతమంది స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమ సమస్య పదిమందికి తెలియజేసేందుకు నామినేషన్లు దాఖలాలు చేశారు.నామినేషన్లు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది.అభ్యర్థి తమకు సంబంధించిన అన్ని వివరాలు అందులో పొంద పర్చాలి.ఎలాంటి విషయాలను దాయడానికి వీల్లేదు.దాదాపు సీనియర్లు,నిప్పుల సలహాలను తీసుకుని అభ్యర్థులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. రిటర్నింగ్ అధికారితోపాటు సంబంధిత అధికారులు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి లోటుపాట్లను తెలిపారు.ఈ మేరకు అభ్యర్థులు వాటిని మార్చుకుని మరో సెట్ నామినేషన్లు దాఖలాలు చేశారు.ఎలాంటి సమాచారం లోపమున్న అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలోనే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది.
చివరి రోజు….
ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది.వారం రోజులపాటు ఎన్నికల కమిషన్ సమయం ఇచ్చింది. శుక్రవారం తో గడువు ముగిసిపోతుంది.ఈ లోపు స్వీకరించిన నామినేషన్లను ఈ నెల 13వరకు స్ర్కుటిని చేయనున్నారు.ఈ నెల 15 వరకు విత్ డ్రా చేసేందుకు అవకాశం ఇచ్చారు.ఈ ప్రక్రియ తో పూర్తియిన తరువాత మిగిలిన వారే ఈ నెల 30న నిర్వహించనున్న ఎన్నికల బరిలో ఉంటారు.
Spread the love