గొడ్డలి దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం మండలంలోని సాయి పేట గ్రామంలో చోటుచేసుకుంది.ఈ సందర్భంగా స్థానిక సీఐ శ్రీధర్ రావు తెలిపిన వివరాల ప్రకారం ఎలుకతుర్తి మండలంలోని గోపాల్పూర్ గ్రామ నివాసి గండికోట లక్ష్మణ్ (28)ను మండలంలోని సాయిపేట గ్రామంలో దద్దు రాజయ్య, అతని కుమారుడు దద్దు మహేందర్ ఇరువురు గుడ్డలతో నరికి హత్య చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంటుంది. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో గొర్రెల మంద నుంచి గొర్రెలను దొంగతనము చేయడానికి వచ్చినారని నేపంతో లక్ష్మణ్ పై కొమ్మగొట్టే గొడ్డలి తో దాడి చేయడంతో అక్కడికక్కడే లక్ష్మణ్ మృతి చెందడం జరుగుతుందని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, పంజనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఎంజిఎం మార్చురీకి తరలించామని తెలిపారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
నా భర్తను చంపిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి..
నా భర్తను చంపిన వాళ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హతుని భార్య గండికోట కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి.గండికోట శేఖర్,సూర శ్రీకాంత్, గండికోట రమేష్ ఇరువురు ఎలుకతుర్తి లోని పంప్ హౌస్ లో విధులు నిర్వహిస్తూ వారందరూ సాయంత్రం హనంకొండలో సామాన్లు తేవడానికి వెళ్లి వస్తామని చెప్పడం జరుగుతుందని ఆరోపించారు.దీంతో వారందరూ మండలంలోని సాయి పేట గ్రామంలో కంది తిరుపతి ఇంటికి వెళ్లి భోజనం చేశారని, అనంతరం షికారుకు వెళ్లారని, ఈ క్రమంలో గొర్రెల మంద వీరందరినీ చూసి అరువగా ఆ మంద గొర్రెల కాపలదారులు మాపై దాడి చేసే ప్రయత్నం చేయగా లక్ష్మణ్ వారితో ఒకరినొకరు పెనుగులాడం జరిగిందని దీంతో కుమ్మగొట్టే గుడ్డలతో లక్ష్మణ్ పై దాడి చేసి హత్య చేయడం జరిగిందని ఆరోపించారు. హత్య చేసిన తండ్రి కొడుకులను చట్టరీత్యా చర్యలు చేపట్టి, కఠిన శిక్ష విధించాలని ఆరోపించారు.