Sunday, August 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘‘బుడ్డోడా బుడ్డోడా అంటే...’’

‘‘బుడ్డోడా బుడ్డోడా అంటే…’’

- Advertisement -

‘‘బుడ్డోడా.. బుడ్డోడా అంటే గుడ్డ‌లూడ‌దీసి కొడ‌తా… ’’అంటాడు ఓ సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఇదే త‌ర‌హాలో బీహార్‌కు చెందిన ఆరేండ్ల బాలుడు ఆదిత్య కుమార్ దుమ్మురేపాడు. అంతేకాదు ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌ను ప్ర‌శ్నిస్తూ, పాల‌కుల‌పై దుమ్మెత్తి పోశాడు. ప్రధాని రాజీనామా చేయాలంటూ అత‌డు ప‌ట్టుకున్న పోస్ట‌ర్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే ప‌రీక్ష‌లు, వాటిలో అక్ర‌మాల గురించి నీకెందుకు? అని అడిగిన పోలీసుల‌కు మ‌న బుడ్డోడు అద‌ర‌గొట్టే స‌మాధాన‌మిచ్చి, వారి నోరు మూయించాడు. ఇప్పుడు నేను ప్ర‌శ్నిస్తేనే క‌దా? నేను పెద్ద‌య్యే నాటికి, నా త‌రానికి న్యాయం జ‌రిగేది… అంటూ అత‌డిచ్చిన జ‌వాబు.. ఢిల్లీ పీఠాన్ని గ‌డ‌గ‌డ‌లాడి స్తోంది. ఇప్ప‌టిదాకా కూడు కోసం ఏడ్చాం, గూడు కోసం ఏడ్చాం, క‌ట్టే బ‌ట్ట కోసం ఏడ్చాం.. ఇక ఏడుపుల్లేవు, ప‌రిగెత్త‌టాల్లేవు.. పాల‌కుల‌కు ప్ర‌శ్నించ‌ట‌మే.. వాళ్ల‌ను ప‌రిగెత్తించ‌ట‌మే… అన్న‌ట్టుగా సాగిన ఆ బుడ‌త‌డి వ్య‌వ‌హార‌ శైలి… ఔరా… అనిపించ‌క‌మాన‌టం లేదు. ద‌టీజ్ జ‌న్ జ‌డ్‌, జ‌న్ జీ.. జ‌న్ ఆల్ఫా… కాదంటారా…? అందుకే ప్ర‌శ్నే అనేకాంశాల‌ను ప‌రిష్కారం చూపుతుంది. మ‌న‌ల్ని న‌డిపిస్తుంది, స‌మాజానికి దారి చూపిస్తుంది…
-బి.వి.ఎన్‌.ప‌ద్మ‌రాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -