Thursday, September 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిట్రంప్ చెలగాటం-ఇరకాటంలో భారత్!

ట్రంప్ చెలగాటం-ఇరకాటంలో భారత్!

- Advertisement -

రష్యా, ఇరాన్ నుంచి దిగుమతులు చేసుకొనే దేశాలనుంచి అమెరికాకు చేసే ఎగుమతులపై వందశాతం అపరాధ సుంకం విధించేందుకు అవసరమైన బిల్లుకు బుధవారం నాడు అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ-కాంగ్రెస్ 262-159 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 58 మంది డెమోక్రాట్లు కూడా మద్దతివ్వటాన్ని బట్టి అధికార రిపబ్లికన్‌లు ప్రతిపక్ష డెమోక్రాట్లు ఒక్కటిగానే ఇతర దేశాల మీద ఆర్థిక యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు వేరే చెప్పనవసరం లేదు. ఆగస్టు నెలలో సెనెట్ ఇదే బిల్లును 86-11 ఓట్లతో ఆమోదించింది. ఇరాన్ ఆణు కార్యక్రమానికి వ్యతిరేకంగా మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్‌పై రష్యా 2022 ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్న మిలి టరీ చర్యకు వ్యతి రేకం ఈ బిల్లు అని చెప్పి నప్పటికీ అమెరికా రాజ కీయ, ఆర్థిక ప్రయో జనాలకోసమే ఈ విపరీత చర్యకు పాల్ప డ్డారన్నది వాస్తవం! ఏడుగురు రిపబ్లికన్లు, 152 మంది డెమోక్రాట్లు బిల్లును వ్యతిరేకించ ారు. ఇప్పటికే సెనెట్ కూడా ఆమోదించి నందున అధ్యక్షుడి ఆమోదంతో అది చట్టంగా మారి అమలుకు తెరలేపనుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయినప్పటికీ దాన్ని అమలు చేసే సత్తా అమెరికాకు ఉందా అన్నది పెద్ద ప్రశ్న. ఏ దేశం నుంచి కొనుగోలు చేయవచ్చో, కూడదో చెప్పటానికి అసలు అమెరికా పార్లమెం టుకు ఏం హక్కు ఉంది?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ నేపథ్యంలో ఇరాన్, రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయ వచ్చంటూ ట్రంప్ మనదేశానికి “అనుమతి” ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు విధించిన షరతులను చైనా ఎన్నడూ పట్టించుకోలేదు. మనదేశం అమెరికాకు భయపడి ఇరాన్ నుంచి పూర్తిగా దిగుమతులను నిలిపివేసింది, రష్యా నుంచి మధ్యలో దిగుమతులను తగ్గించింది. ఇటీవల తిరిగి భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగి నందున అది రష్యాకు అనుకోని వరంలా మారి అదనపు రాబడిని తెచ్చిపెడుతున్నది.పైకి ఉక్రెయిన్‌పై సాగుతున్న రష్యా దాడులని చెప్పినప్పటికీ మనల్ని, చైనా మీద వత్తిడి తేవటం, నవంబరు మూడవ తేదీన జరిగే తమ పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి లబ్ది చేకూర్చే ఎత్తుగడ కూడా ఈ బిల్లు వెనుక ఉంది. ఇప్పటికే వివిధ కారణాలతో ట్రంప్ పలుకుబడి దిగజారి రిపబ్లికన్ పార్టీ ఓటమితో ఉభయ సభల్లో మెజారిటీ కోల్పోతారనే విశ్లేష ణలు వెలువడు తున్నాయి. అయినప్పటికీ బస్తీమే సవాల్ అన్నట్లుగా పట్టుబట్టి మరీ తాజా బిల్లును ఆమోదింపచేయించాడు. రష్యా నుంచి అధికా రికంగా దిగుమతి చేసుకొనే సరకుపైనే కాదు, ఆంక్షలను తప్పించుకొని చమురును సరఫరా చేసే వివిధ దేశాల టాంకర్ల మీద కూడా ఆంక్షలు వర్తిస్తాయి.

ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్లుగా చట్టసభల ఆమోదం, అధ్యక్షుడి స్టాంప్ పడిన తరువాత కూడా అమలు చేసే సాహసం ట్రంప్‌నకు ఉందా అనే అనుమానాలు ఉన్నాయి.నరేంద్రమోడీ తన జిగినీ దోస్తు అని చెప్పినప్పటికీ ఇప్పుడు ట్రంప్ ఆచరణలో మన దేశానికి శత్రువుగా వ్యవహరించేందుకు పూనుకున్నాడు. ఇరాన్‌పై దాడి విషయంలో రష్యా, చైనా ఎలాంటి శషభిషలు లేకుండా అమెరికా-ఇజ్రాయిల్ చర్యలను ఖండించాయి. మన దేశం మాత్రం మౌన దౌత్యం పేరుతో ట్రంప్-నెతన్యాహును సంతుష్టీకరిస్తున్నది. అయినాగానీ లోలోపల ట్రంప్ రగిలిపోతూ పైకి మాత్రం ఇప్పటికీ తీపికబుర్లు చెబుతున్నాడు. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో ఆమోదించిన ప్రకటనలో అమెరికా పేరు ఎత్తనప్పటికీ ఇతర పదజాల మంతా దాని పెత్తనం, అఘాయి త్యాలను ఖండించేవే అన్నది తెలిసిందే. బ్రిక్స్ భేటీ ఉంటుందని తెలిసీ ఆది ముగిసేవరకు వేచిచూసి తరువాత బిల్లును ఆమోదింపచేయటం కూడా ఒక పథకం ప్రకారం జరిగిందే. అయితే ఈ బిల్లును ఎలా అమలు జరిపేదీ స్పష్టమైన తరువాత భారత్, చైనాలు దానికి అనుగుణంగా స్పందిస్తాయి. కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా గతంలోనే చైనా స్పష్టం చేసింది. తమ అవసరాలకోసం ఎవరిదగ్గర అయినా ఇంథన కొనుగోలు చేస్తామని మన విదేశాంగశాఖ కూడా గతంలో చెప్పింది. కొన్ని దేశాల మీద అమెరికా మిలిటరీ దాడులు చేస్తూ మరికొన్నింటి మీద ఆర్థిక యుద్ధాలు చేస్తున్నది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ కూటమి అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు సభ్యదేశాల మధ్య ఆర్థిక లావాదేవీలను పెంచుకోవాలని నిర్ణయించటం ఒక ముఖ్య పరిణామం. అదే ఆచరణాత్మక ప్రత్యామ్నాయం. ఎగుమతులకు అమెరికా లేదా దాని అడుగులకు మడుగులొత్తే దేశాల మీద ఆధారపడటం గాక ఇతర మార్కెట్లను అన్వేషించటంతో పాటు దేశీయంగా వస్తు వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాల్సి ఉంది. చైనా అదే విధానాలతో ముందుకు పోతున్నది. ఇప్పటివరకు నరేంద్రమోడీ వైపు నుంచి అలాంటి ప్రయత్నాలేమీ పెద్దగా లేవు. అందుకే ట్రంప్ చెలగాటంతో మోడీ దేశాన్ని ఇరకాటంలో పెట్టారని చెప్పాల్సి వస్తోంది! ఇది వ్యక్తిగత సమస్య కాదు, 146 కోట్ల జనాభాకు సంబంధించినది!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -