Sunday, August 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘‘ఆదిత్య 2028’’

‘‘ఆదిత్య 2028’’

- Advertisement -

1991 జూలై 18న తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన చిత్రం ‘ఆదిత్య 369’. అందులో టైమ్‌‌మిషన్‌ ‌సెంటారాఫ్‌ అట్రాక్షన్‌. ఆ మిషన్‌‌లోకి వెళ్తే మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడే భయానక వాతావరణం, కాలుష్యం, భయంకరమైన చావుల ప్రభావంతో మారిన ప్రజల జీవితాలు ఎలా ఉండబోతున్నాయో హీరో, హీరోయిన్లకు ముందుగానే తెలుస్తుంది. తిరిగొచ్చి అందుకు కారణం కాబోతున్న విలన్‌ను ‌తుదముట్టిస్తాడు. అది కథ. నేటి బీహార్‌ ‌రాష్ట్రం పాట్నా పట్టణ సమీపంలోని ఆరేండ్ల బాలుడు ఆదిత్య మాటలు టైమ్‌ ‌మిషన్‌ ‌మాదిరిగానే ‌దేశ భవిష్యత్తు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొబోతున్నదనే తెలియజేస్తున్నాయి. ‘బాలవాకు బ్రాహ్మ వాక్‌’ అని పెద్దలంటారు. ఈ ఆరేండ్ల చిన్నారి దేశ పాలకుల గురించి వాక్‌ ‌చెబుతున్నాడు. దేశ ప్రస్తుత పాలకుల వల్ల ప్రజల జీవితాలు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నాయో చెప్పడం విశేషం. గణితం, సైన్స్‌ ‌సూత్రాలు, చెస్‌, క్యారమ్స్‌, డైలాగులు చెప్పడంలో ఎంతోమంది బాల మేధావులున్నారు. కానీ, ఈ బుడతడు మాత్రం రాజ్యాంగంలోని ఎనభై పేజీలు చదివి, దేశ పాలకులను ప్రశ్నించి, చివరకు ఖాకీల చేతుల్లో చిలుకలా మారాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ ‌కావడంతో బాలుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చామంటూ ఖాకీలు కహానీలు చెప్పారు. ఈ తెగువ, ధైర్యం, సాహసం రాజ్యాంగం ఇచ్చిన జ్ఞానమని చెప్పి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు బాలుడు. దటీజ్‌ ఆదిత్య 2028.
గుడిగ రఘు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -