మే 5న కబడ్డీ జిల్లా సంఘము ఎన్నికలు

నవతెలంగాణ – మోపాల్
ఏప్రిల్ 12న స్థానిక డి ఎస్ ఏ స్విమ్మింగ్ పూల్ లో ఆవరణలో నిర్వహించిన జిల్లా కబడ్డీ కార్యవర్గ సంఘ సమావేశంలో నూతన నూతనంగా అనగా 2024 నుంచి 2028 కాల పరిమితి గాను ఎన్నికలను జరపాలని తీర్మానించి సదరు ఎన్నికలను సజావుగా నిర్వహించుటకు గాను ఎన్నికల  రిటర్నింగ్ అధికారిగా బొబ్బిలి చిన్నారెడ్డిని జిల్లా కమిటీ సంఘ ప్రధాన కార్యదర్శి అంద్యాల లింగన్న గారు నియమించారు. దానిని నేను సమ్మతించి ఈ క్రింద తెలిపిన ఎన్నికలకు సంబంధించిన విధానాన్ని తెలియజేయడం జరిగింది.2024 2028 నాలుగు సంవత్సరాల కాల పరిమితిగాను క్రింద తెలిపిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడును అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఐదుగురు, ప్రధాన కార్యదర్శిగా ఒకరు, సంయుక్త కార్యదర్శి ఐదుగురు, కోశాధికారిగా ఒకరు,కార్యవర్గ సభ్యులుగా 9మంది ఎన్నికలు జరుగును. ఈ ఎన్నికలకు గాను  నామినేషన్ ప్రక్రియ ఎన్నికలు స్థానిక DSA స్విమ్మింగ్ పూల్ లో జరుపబడును. ఉదయం 10 గంటల నుంచి నిర్వహించబడును మండల అధ్యక్ష కార్యదర్శులు ఈ ఎన్నిక విధానంలో భాగంగా ఓటు హక్కును వినియోగించుకుంటారు 26 -4 -2024న నామినేషన్ల నామినేషన్ పేపర్ల వితరణ రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు తీసుకోనవలెను. 28 4 2024 రోజున అభ్యర్థుల నుండి  నామినేషన్ స్వీకరణ 12 గంటల నుండి 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడును. 29- 4- 2024 రోజున నామినేషన్ల పరిశీలన భారీ లో ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడించబడును 30-4- 2024 రోజున నామినేషన్ లో ఉపసంభరణ 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.  1-05- 2024 బరి లో ఉండే అభ్యర్థుల జాబితా వెల్లడి. 5-5- 20 24 న ఉదయం 10 గంటలకు సర్వసభ్యసమావేశము తదుపరి అదే రోజున రహస్య బ్యాలెట్ విధానం ద్వారా స్థానిక డీఎస్సీ స్విమ్మింగ్ పూల్ సుభాష్ నగర్ ఆవరణలో ఎన్నికలునిర్వహించబడతాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిన్నారెడ్డి ఒక ప్రకటనలు తెలిపారు.
Spread the love