కడియంకు డిపాజిట్‌ కూడా రానీయద్దు: స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థి సింగపురం ఇందిర

కడియంకు డిపాజిట్‌ కూడా రానీయద్దు: స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థి సింగపురం ఇందిరనవతెలంగాణ-రఘునాథపల్లి
స్టేషన్‌ఘన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరి మహిళ అభ్యర్థిని అవమానపరచడం ఎంత వరకు సమంజసమని, అతనికి డిపాజిట్‌ రాకుండా ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని స్టేషన్‌ఘన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. గురువారం రఘు నాథపల్లి మండలం వెల్ది, అశ్వరావుపల్లి, కుసుంబాయి తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజ కవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజలకు మాయమాటలు చెబుతూ మభ్యపెడుతున్న బీఆర్‌ఎస్‌ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. శ్రీహరి గ్రామా ల్లో డబ్బు సంచులతో తిరుగుతూ కాంగ్రెస్‌ పార్టీ అభ్య ర్థిని ఇష్టారాజ్యంగా తిడుతున్నాడని అతనికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపవలసిన సమయం దగ్గర్లోనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు ఇప్పిస్తామని, 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. మంత్రిగా పని చేసినప్పుడు కడియం శ్రీహరి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో 250 మంది దళిత యువకులను ఎన్‌కౌంటర్‌ చేపించిన చరిత్ర ఆయన దన్నారు. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త కడియం శ్రీహరికి చరమగీతం సమయం దగ్గరలోనే ఉందని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్‌ చంద్ర రెడ్డి, ఎంపీపీ వరలక్ష్మి నరేందర్‌, రమేష్‌ పటేల్‌ రవిగౌడ్‌ కోళ్ల, యువరాజు, యాదవరెడ్డి, కొమురెల్లి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love