ఎమ్మార్వో ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

నవ తెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల నూతన తాసిల్దార్ నాగరాజును కాంగ్రెస్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి బోకే అందించి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మండల ప్రజానీకానికి సరైన సేవలు అందించాలని ఎమ్మార్ నాగరాజుకు కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి మహిళా జనరల్ సెక్రెటరీ ఆంగోతు సుగుణ, డిసిసి ఉపాధ్యాయుడు గద్దె సమ్మిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న రమేష్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ వి.వంశవర్ధన్ రావు, మహేష్ రవీందర్రావు,కాటారం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొట్టే శ్రీహరి, బయ్యారం మాజీ సర్పంచ్ చీనాల బ్రహ్మారెడ్డి , ,అంకుసాపూర్ గ్రామ మహిళా అధ్యక్షురాలు చిన్నక్క, యూత్ నాయకుడు మంత్రి ప్రభాకర్, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love