ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

నవ తెలంగాణ- కాటారం
కాటారం మండలం గుండ్రాత్ పల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్రగిరి అశోక్, చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా అతుకూరి రమేష్, ఉపాధ్యక్షులుగా కార్తీక్, ప్రధాన కార్యదర్శిగా దుర్గయ్య, ప్రచార కార్యదర్శిగా మల్లేష్, అధికార ప్రతినిధిగా జిల్లాల శ్రీనివాస్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడతామని హామీ ఇచ్చి 9 సంవత్సరాలు గడిచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలకు, మాదిగ ఉప కులాలకు ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 30వ తేదీన మందకృష్ణ మాదిగ భూపాలపల్లి లో వస్తున్నారు. కావున ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరూ పాల్గొని జిల్లా మహాసభను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love