కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు ఓ.. వరం

నవతెలంగాణ – తిరుమలగిరి
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ఒక వరమని  తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్  అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 28 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆడపిల్లల కన్న తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి ఈ పథకం కొంతమేర ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీల  పథకాల్లో భాగంగా ఈ కళ్యాణ లక్ష్మి పేరును కొద్దిగా నామకరణం చేసి పెళ్లి చేసుకునే ఆడబిడ్డలు అందరికీ లక్ష 116 రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామని,సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ పథకం త్వరలోనే అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలు జరిగి మహిళలందరూ నేడు  ఉచిత ప్రయాణం చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అదేవిధంగా రాజు ఆరోగ్య శ్రీ బీమా పథకం కింద 10,00,000 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అమలు జరిగిందన్నారు. మిగిలిన గ్యారెంటీ పథకాలు కూడా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలవుతాయన్నారు. తనకు ఓటు వేసి గెలిపించిన తుంగతుర్తి నియోజకవర్గానికి రుణపడి ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధి కొరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్  కుమార్ రెడ్డి లతో మాట్లాడి పోట్లాడైన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్నేహలత, జెడ్పిటిసి దూపటి అంజలి, వైస్ ఎంపీపీ  బొడ్డు సుజాత, పిఎసిఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్,తాసిల్దార్ రమణారెడ్డి, ఎంపీడీవో ఉమేష్ చారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Spread the love