నవతెలంగాణ – కామారెడ్డి
ప్రభుత్వం ప్రకటించిన గ్రూపు వన్ ఫలితాలలో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చిన్న లచ్చపేట గ్రామానికి చెందిన భూష ఉదయ్ కిరణ్ కుమార్ 67వ ర్యాంకు సాధించారు. రచ్చ పేట గ్రామానికి చెందిన భూస ఉదయ్ కిరణ్ కుమార్ తండ్రి మురళి విద్యుత్ శాఖలో లైన్మెన్ గా, తల్లి లలిత ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని ఆ దంపతులకు జన్మించిన ఉదయ్ కిరణ్ గ్రూప్ వన్ లో 67వ ర్యాంకు సాధించి కామారెడ్డి జిల్లాలో డీఎస్పీ సాధించిన విద్యార్థిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో గ్రూప్ వన్ పోస్ట్లు 67వ ర్యాంకు సాధించి డీఎస్పీ పోస్టు కు అర్హత సాధించడంతో అతనిని గ్రామస్తులతో పాటు మండల జిల్లా వాసులు అభినందిస్తున్నారు.