రజక సంఘం నూతన అధ్యక్షుడిగా కారంకంటి ఆంజనేయులు

నవతెలంగాణ – దుబ్బాక
రజక సంఘం అభివృద్ధికి సంఘ సభ్యుల సహకారంతో తాను ఎల్లవేళలా కృషి చేస్తానని రజక సంఘం నూతన అధ్యక్షుడు కారంకంటి ఆంజనేయులు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రజక సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నికలు జరిగగా… రజక సంఘం నూతన అధ్యక్షులుగా కారంకంటి ఆంజనేయులు ను ఏకగ్రీవంగా సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజక సంఘం అధ్యక్షులుగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కులబాందవులకు ఆంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడు ఆంజనేయులు తోపాటు కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజక సంఘం అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేసేందుకు ముందు ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ఉపాధ్యక్షులు కారంకంటి వెంకటేష్, క్యాషియర్ కారంకంటి పవన్,డైరెక్టర్ కంచర్ల లింగం, ప్రచార కార్యదర్శి కంచర్ల నాగరాజు, కార్యవర్గ సభ్యులు, కంచర్ల స్వామి, కంచర్ల మల్లేశం, దొడ్ల శివరాజం, కంచర్ల ప్రవీణ్, కారంకంటి రాజు, రజక సంఘం సభ్యులు పలువురు పాల్గొన్నారు.
Spread the love