మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సతీమణి కవ్వంపల్లి అనురాధ, ఆయా మండలాల నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్లోని వైఫల్యాలు,వ్యతిరేకత,కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పెరిగిన ఆదరణ,మానకొండూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఎమ్మెల్యే ఎన్నికకు తొడ్పడుతాయని కవ్వంపల్లి సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.అంతకుముందు నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు.భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు.
కవ్వంపల్లి సమక్షంలో బీఆర్ఎస్ శ్రేణుల చేరికలు..
మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ శ్రేణులు తిప్పారపు సురేష్,జేరిపోతుల మధు కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు