ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71వ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వేణు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజమౌళి,  మహేందర్ రెడ్డి, మల్లేశం, రామచంద్రం, నరేష్, ప్రభాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love