రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది కేసీఆర్..

నవతెలంగాణ – మునుగోడు

కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రాదాత కెసిఆర్ అని బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పగిళ్ల  సతీష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా బలోపేతం చేయాలనే గొప్ప సంకల్పంతో బిఆర్ఎస్  ప్రభుత్వం  అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేసిందని అన్నారు. వ్యవసాయం చేసే రైతులు ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడకుండా ప్రతి ఏడాది రెండు విడతల రైతుబంధు ఎకరానికి రూ.5000 ఇచ్చి రైతు బాంధవుడుగా రైతులను ఆదుకున్నారని అన్నారు. రెండు లక్షల రైతు రుణమాఫీ ఇస్తానని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి  నాలుగు నెలలు కావస్తున్న రైతు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ చెప్తున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. రాష్ట్రంలోని ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు కారు గుర్తుపై ఓటు వేసి చామ మల్లేష్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పోలగొని విజయలక్ష్మి సైదులు,  ఈద నిర్మల శరత్ , అయిత గోని విజయ్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు వట్టికోటి నరసింహ, నరేష్ , టిఆర్ఎస్ నాయకులు సింగం శివయ్య , రేవెల్లి సైదులు, చింటూ, మిరియాల రవి, పందుల రాజశేఖర్, పందుల సూరన్న తదితరులు ఉన్నారు.
Spread the love