Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజీబీవీ పిలుస్తోంది.!

కేజీబీవీ పిలుస్తోంది.!

- Advertisement -

ఆంగ్ల మాధ్యమంలో బోధన
ఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభం
నవతెలంగాణ – మల్హర్ రావు

పేద, వెనుకబడిన, మధ్యలో బడి మానిన బాలికలకు విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)లను ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు లేని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో వీటిని ప్రారంభించింది. చదువుతో పాటు క్రమశిక్షణ,సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఇంటర్ వరకు బోధన అందిస్తున్నారు. 2026-27 విద్యాసం వత్సరానికి సంబంధించి మండలం దుబ్బపేటలోని కస్తూర్బా పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.దీంతో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఆరో తరగతిలో..
ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏమైనా ఖాళీలు ఉంటే ప్రవేశాలు కల్పిస్తున్నారు.పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్లు తీసుకుంటున్నారు.

ఆంగ్లంలో బోధన..
పాఠశాలలో విద్యార్థినులకు పలు వసతులు కల్పించడం, మెనూ ప్రకారం ఆహారం, నాణ్యమైన విద్య, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలలు నిరుపేద బాలికలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులతోపాటు నైపుణ్యాలతో కూడిన విద్యను బోధిస్తున్నారు. భవిష్యత్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పాందేలా కుట్లు, అల్లికలతో పాటు ఇతర అంశాలను సైతం నేర్పిస్తున్నారు. వివిధ రకాల వృత్తి విద్య కోర్సులు సైతం అమలు చేస్తున్నారు.

దరఖాస్తు ఇలా..
కస్తూర్బా విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి మొదట తల్లిదండ్రులు లేని విద్యార్థినులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. తర్వాత మిగిలిన విద్యార్థినుల ప్రవేశాలను నమోదు చేసుకుంటున్నారు. ప్రవేశాలకు విద్యార్థులు 5వ తరగతి వరకు చదువు కున్న బోనఫైడ్, టీసీ, ఆధార్కార్డు జిరాక్స్, పాస్ ఫొటోలు జత చేయాలి.

విద్యార్థినులకు మంచి అవకాశం: మెరుగు భవాని. .ప్రత్యేక అధికారి దుబ్బపేట కస్తూరిబ్బా పాఠశాల
నాణ్యతతో కూడిన విద్య,వసతి గృహం అందుబాటులో ఉన్నందున గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.భవిష్యత్లో విద్యార్థినులకు ఉపాధి కల్పించేలా వృత్తి విద్య కోర్సులు, కుట్లు, అల్లికల్లో ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నాం. ఈ శిక్షణ భవిష్యత్లో ఉపాధి అవకాశాలకు ఉపయోగపడతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -