Saturday, May 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమందుబాబులకు షాక్..భారీగా పెరగనున్న మద్యం ధరలు..!

మందుబాబులకు షాక్..భారీగా పెరగనున్న మద్యం ధరలు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో మద్యం ప్రియులకు త్వరలో షాక్ తగలబోతోంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పెరిగిన ఉత్పత్తి వ్యయం, డిస్టలరీల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నెలలోనే కొత్త ధరలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పెంపు అమలైతే ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై రూ.100 వరకు భారం పడొచ్చని అంచనా. గత ఏడాది కాలంగా మద్యం తయారీ కంపెనీలు ధరల పెంపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, ముడిసరుకుల రవాణా ఖర్చులు, బాటిళ్ల తయారీకి వినియోగించే గ్యాస్ ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -