Saturday, May 2, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మొక్క జొన్న రైతులకు ఆదుకుంటాం

మొక్క జొన్న రైతులకు ఆదుకుంటాం

- Advertisement -

అగ్ని ప్రమాద రైతులకు నష్ట పరిహారం అందేలా చూస్తా
మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి

నవతెలంగాణ-కుభీర్
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మండలంలో ఇటీవల ఆయా గ్రామల్లో ఉన్న రైతుల పంట క్షేత్రాల్లో మొక్క జొన్న పంటలు ప్రమాదవ శాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంబవించి మొక్క జొన్న పంటలు పూర్తిగా కాలి బూడిద కావడం జరిగింది. మండలంలోని దార్ కుభీర్, ఫార్డి కే, నిగ్వ గ్రామంలో దాదాపుగా 42ఎకరాల్లో మొక్క జొన్న, జొన్న పంటలు కాలిపోవడం జరిగింది. దింతో శనివారం విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గ్రామాలను సందర్శించి మొక్క జొన్న పంట క్షేత్రాల్లో పర్యటించారు.

ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో గత కొన్ని రోజుల నుంచి ఆయా గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలు కాళ్ళ ముందే కాలిపోవడంచాలా బాధాకరమైన విషయం అది చూసిన రైతు కన్నీరు మున్నీరు చెందారు. దింతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించాడం జరిగింది. దింతో రైతులు ఎవరు కూడా అధైర్య పడకుండా నష్ట పోయిన రైతుకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వానికి నష్టపరిహారం లేదా చూస్తానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట  మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్,మాజీ జడ్పీటీసీ శంకర్ చావన్, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్,హల్ద దేవేందర్,మహిపాల్ రెడ్డి, పెంటజీ, మల్లేష్ రైతులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -