ఇసుక అక్రమ డంపులు సీజ్ చేసింది గోరంత…చేయాల్సింది కొండంత

నవతెలంగాణ రెంజల్:
రెంజల్ మండలంలో అక్రమ ఇసుక డబ్బులు తారస్థాయికి చేరుకుంటున్నాయి. సోమవారం బోర్గం గ్రామంలో సుమారు వేయి ట్రాక్టర్ల అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేయగా, మండలంలోని పలు గ్రామాలలో ఇసుక నిలువలను ఇసుక మాఫియాలు యదేచ్చగా తమకు అనుకూలమైన చోట్ల నిలువచేసిన స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాసిల్దార్ కార్యాలయం లో సీజ్ చేసిన అక్రమ ఇసుకను వారే తక్కువ రేటుకు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. ఇసుక మాఫియాకు పరోక్షంగా అధికారులే ఊతమిస్తున్నారని ప్రజలు చర్చించు కుంటున్న ఉంటున్నారు. మండల స్థాయి అధికారులకు కార్యాలయం పనులలో నిమగ్నం అవ్వడం వారికి అవకాశం గా మారింది. ఇటీవల ఎడపల్లి ఎస్సై ఎలాంటి అనుమతి పత్రాలు లేని మూడు ఇసుక టిప్పర్లను స్వాధీనం చేసుకోవడం పాఠకులకు విధితమే. డివిజన్, జిల్లాస్థాయి అధికారులు అక్రమ ఇసుక నిల్వాలపై ప్రత్యేక దృష్టిని సారించినట్లయితే తప్ప వారిని నివారించడం సాధ్యం కాదని ప్రజలు పేర్కొంటున్నారు. అక్రమ ఇసుక నిలువలపై రెవెన్యూ శాఖతో పాటు, పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టిని సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Spread the love