ఏడబ్ల్యుయు సొసైటీ కాటారం మహిళ అధ్యక్షురాలుగా కొండూరి మమత

నవతెలంగాణ – మల్హర్ రావు
అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 కాళేశ్వరం జోనల్  ఐదు జిల్లాల యువశక్తి అధ్యక్షుడు  చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడుగా బండి సుధాకర్ సూచన మేరకు  ఏడబ్ల్యుయు కాటారం సబ్ డివిజన్ అధ్యక్షురాలుగా మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ కొండూరి మమతను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. తమపై నమ్మకంతో ఈ పదవిని అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్, కుమార్ యాదవ్, బండి సుడకర్ లకు మమత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ బాధ్యతపై అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీకి మంచి పేరు తీసుకవస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం జోనల్ నాయకుడు గంట రాజబాబు,జిల్లా అధ్యక్షు రాలు కొండ రాజమ్మ,మండల అధ్యక్షురాలు ఏనుగు నాగరాని,ఎస్.యు కాటారం సబ్ డివిజన్ అధ్యక్షుడు వేల్పుల మహేందర్ పాల్గొన్నారు.
Spread the love