కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షునిగా లాదినేని రమేష్

నవతెలంగాణ –  సూర్యాపేట కలెక్టరేట్
హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నిక ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔర్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సూర్యాపేట జిల్లాకు చెందిన లాదినేని రమేష్ ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో యూనియన్ కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన కు నియామక పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీ యఉధ్ధీన్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శాంతి కుమార్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బిక్షపతి, రాష్ట్ర ట్రెజరీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love