నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ చెందిన ఎథ్నిక్ స్నాక్-ఫుడ్ బ్రాండ్లలో ఒకటైన హల్దీరామ్స్ నాగ్‌పూర్, ఈ రోజు భారతదేశంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న దాని నిల్వకారక రహిత ఫ్రోజెన్ మరియు RTE ఆహార శ్రేణి- “మినిట్ ఖానా” ను విడుదల చేసినట్లు వెల్లడించింది. రెండేళ్ల షెల్ఫ్ లైఫ్‌తో మినిట్ ఖానా దేశవ్యాప్తంగా మరియు ఐదు ఖండాల్లోని 40కి పైగా ఇతర దేశాలలో వాణిజ్య విక్రయాల కోసం అందుబాటులో ఉంటుంది, తద్వారా ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉండే భారతీయ ఎథ్నిక్ ఫుడ్ శ్రేణిగా మారింది. మినిట్ ఖానా శ్రేణిలో కొన్ని భారతదేశపు అత్యంత ప్రసిద్ధ ఎథ్నిక్ స్నాక్స్, స్వీట్లు మరియు వంటకాలు ఉన్నాయి, ఇవి సాంప్రదాయ హల్దీరామ్స్ నాగ్‌పూర్ యొక్క రుచిని మిళితం చేస్తాయి. వినియోగదారులు ప్రయాణంలో మరియు నిమిషాల వ్యవధిలో ప్రామాణికమైన భారతీయ ఆహారం యొక్క రుచిని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తూనే 21వ శతాబ్దపు డిమాండ్లను సులభంగా మరియు సౌలభ్యంతో తీర్చడంలో హల్దీరామ్స్ నాగ్‌పూర్ ప్రసిద్ధి చెందింది, హల్దీరామ్స్ నాగ్‌పూర్ డైరెక్టర్ అవిన్ అగర్వాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఫుడ్ బ్రాండ్లలో ఒకటిగా, భారతదేశంలో మరియు వెలుపల ఉన్న ఆధునిక మరియు వివేకవంతులైన వినియోగదారుల యొక్క అభివృద్ధి చెందుతున్న ఫుడ్ ప్యాలెట్‌ను అందించడానికి మేము అప్రమప్త తో పని చేస్తున్నాము. కేవలం ఇన్స్టంట్ నూడుల్స్ మాత్రమే కాకుండా అంతకు మించిన, సౌకర్యవంతమైన ఆహార వినియోగంలో వేగవంతమైన వృద్ధిని మనం చూస్తున్నాం. మినిట్ ఖానా వినియోగదారులకు విస్త్రత శ్రేణి భారతీయ స్నాక్స్ మరియు పరాటాల నుండి సమోసాల వరకు సువాసనగా మాత్రమే కాకుండా తినడానికి అత్యంత సురక్షితమైన ఆహారాన్ని అందిస్తుంది. మినిట్ ఖానాతో, భారతదేశం వెలుపల కూడా ప్రజలు భారతీయ ఆహారాన్ని పొందే మరియు వినియోగించే విధానాన్ని పునర్నిర్వచించే, పూర్తి గా నిల్వ కారకాలు లేని RTE ఆహార శ్రేణిని రూపొందించడంలో కూడా మేము ముందున్నాము. హల్దీరామ్స్ యొక్క అసమానమైన పంపిణీ శక్తి ద్వారా, భారతదేశం అంతటా అన్ని ప్రధాన ఆధునిక రిటైల్ల అల్మారాల్లో ఉండ గలమని మేము భావిస్తున్నాము” అని అన్నారు. మినిట్ ఖానా ఫ్రోజెన్ మరియు RTE ఆహార శ్రేణి యొక్క USP గురించి, శ్రీ అగర్వాల్ వివరిస్తూ “ఇది తరతరాలుగా వస్తున్న వంటకాలతో భారతీయ ఆహారాన్ని సృష్టించే పురాతన సంప్రదాయాలకు కట్టుబడి ఉంది. నిజమైన భారతీయ ఆహారం ఆస్వాదించాలనుకునే వారి కోసం, మరీ ముఖ్యంగా వేగవంతమైన మరియు సరసమైన భోజనం కావాలనుకునే వారికి మినిట్ ఖానా సుగంధ ద్రవ్యాలు మరియు రుచుల సింఫొనీ గా నిలుస్తుంది” అని అన్నారు. నాగ్‌పూర్‌లోని హల్దీరామ్‌కు చెందిన 400 ఎకరాల ఫుడ్ పార్క్‌లో మినిట్ ఖానా ఫ్రోజెన్ ఆహార శ్రేణి సంవత్సరానికి 15 మిలియన్ పోర్షన్స్ ఉత్పత్తి సామర్థ్యంతో తయారు చేయబడుతుంది. ప్రజలు మరియు కుటుంబాలు ఫ్రోజెన్ ఆహార సౌలభ్యం వైపు ఆకర్షితులవుతున్నందున, భారతీయ RTE మరియు ఫ్రోజెన్ ఆహార మార్కెట్ విపరీతమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా దేశవ్యాప్తంగా కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచనుంది. IMARC గ్రూప్ ప్రకారం, భారతీయ ఫ్రోజెన్ ఆహారాల మార్కెట్ 2022లో ₹144.3 బిలియన్లకు చేరుకుంది మరియు 2028 నాటికి 16% CAGR వద్ద ₹353.3 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.