
మండలంలోని జుక్కల్ మండలానికి నూతనంగా డిప్యూటి తహసీల్దార్ సత్యనారాయణ ను మంగళవారం నాడు పదవి బాద్యత తీసుకోవడం జర్గింది. ఈ సంధర్భంగా మండలంలోని పలువురు కాంగ్రేస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సంధర్భంగా డిటీ మాట్లాడుతు అంతకు ముందు ఎన్ఫోర్స్ మెంట్ డిటీగా విధులు నిర్వహించానని, ప్రస్తుతం జుక్కల్ మండలానికి డిప్యూటి తహసీల్దార్ గా డిప్యూటేషన్ లో భాగంగా ప్రభూత్వ ఆదేశాల మేరకు పదవి బాద్యతలు తీసుకోవడం జర్గింది. పేదలకు సేవలందించి మంచి గుర్తింపు వచ్చే విధంగా విధులు నిర్వహిస్తానని డీటీ పేర్కోన్నారు.