నవతెలంగాణ – నాగార్జునసాగర్
నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం పట్ల నందికొండ కాంగ్రెస్ కౌన్సిలర్ లు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కుందూరు రఘువీర్ రెడ్డి కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ మాట్లాడుతూ…నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో రఘువీర్ ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రఘువీర్ గెలుపు కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంగత నాయక్,పగడాల నాగరాజు,ఆదాసు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.