ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసిన నేతలు

నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణరెడ్డి అత్యధిక మెజారిటీతో కల్వకుర్తి  శాసన సభ్యులుగా విజయం సాధించిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెల్పినట్టు వారు పేర్కొన్నారు. కసిరెడ్డిని కలిసిన వారిలో నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్, ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు హన్మా నాయక్, కాంగ్రెస్ జిల్లా నాయకులు యాదగిరి రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Spread the love