
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ లను బుధవారం టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి అన్ని ఎన్నికలలో మంచి విజయాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల్యాల సుదర్శన్, పార్టీ సీనియర్ నాయకులు గాల్ రెడ్డి, నరసింహారెడ్డి, అంకం రాజు ఉన్నారు.