ఇసుక అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలు – ఎస్.హెచ్.ఓ యయాతి రాజు

నవతెలంగాణ – అశ్వారావుపేట
అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఎస్.హెచ్.ఓ ఎస్సై యయాతి రాజు తెలిపారు. వడ్డి రంగాపురం కు చెందిన గుత్తి సురేష్ అనంతారం వాగు నుండి అశ్వారావుపేట కు ఆదివారం ట్రాక్టర్ పై ఇసుక తరలిస్తుండగా పోలీస్ తనిఖీ చేసారు. అనుమతులు లేవని తెలియడంతో ఇసుకతో కూడిన ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Spread the love