Sunday, June 14, 2026
E-PAPER
Homeజాతీయంమ‌మ‌తా బెన‌ర్జీకి లీగ‌ల్ నోటీసులు

మ‌మ‌తా బెన‌ర్జీకి లీగ‌ల్ నోటీసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. గెలిచిన ఎమ్మెలతో పాటు ఎంపీలు కూడా తిరుగుబావుట ఎగిరేసిన విష‌యం తెలిసిందే. తాజాగా రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ కుమారుడు బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, మహువా మోయిత్రా, కళ్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, సోనాలి గుహలతో సహా పలువురు టీఎంసీ నాయకులకు లీగల్ నోటీసు పంపారు.

“నా కోసం ఎమ్మెల్యే టికెట్ అడుగుతూ మా అమ్మ ఏడ్చారని మహువా మోయిత్రా అబద్ధం చెప్పారు. ఇవి పూర్తిగా అవాస్తవాలు. రాజకీయ విభేదాలను రాజకీయంగానే పరిష్కరించుకోవాలి తప్ప, వ్యక్తిగత విష‌యాల‌ను లేదా కుటుంబ సభ్యులను అందులోకి లాగకూడదు. చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కును నేను కలిగి ఉన్నాను’అని బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ ఆదివారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -