కాటాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కుష్టు వ్యాధిపై అవగాహన

నవతెలంగాణ – తాడ్వాయి
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కుష్టువ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంజిత్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి మైక్రో బ్యాక్టీరియా లేప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అన్నారు. స్పర్శ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కుష్టు వ్యాధికి అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలందరి సహకారంతో కుష్టు నివారణ సాధ్యమవుతుందన్నారు. మొదట విద్యార్థులతో కుష్టు వ్యాధి నివారణకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల హెచ్ఎం, కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్ ఈ ఓ సమ్మయ్య, ఎం ఎల్ హెచ్ పి ఆస్పియా, హెల్త్ అసిస్టెంట్(ఎఫ్) చంద్రకళ, హెచ్ ఏ నవలోక, ఉపాధ్యాయులు ఆశాలు కవిత, అనిత తదితరులు పాల్గొన్నారు.
Spread the love