
ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు బూజో పార్టీలు ప్రజలకు డబ్బు, మద్యంతో ప్రలోభ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యలపై పోరాడే భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు. సోమవారం మండల కేంద్రంలో జహంగీర్ ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడే ఎర్రజెండ చరిత్రను పునరావృతం చేయడానికి కార్మికులు కర్షకులు నడుం బిగించి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రజెండా కు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కార్యకర్తలు గ్రామ గ్రామాన ఎర్రజెండా చేసిన పోరాటాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ రైతంగ సాహిత పోరాటంలో కమ్యూనిస్టులు వీరవచిత పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది కమ్యూనిస్టులు ప్రాణాలను అర్పించారని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సాధించి , గెలిచిన వ్యక్తి రావి నారాయణరెడ్డి అని అన్నారు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం లో కమ్యూనిస్టుల పాత్ర ఏందో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే పార్టీ ఒక ఎర్రజెండానే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు , మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను , వేముల లింగస్వామి , మునుగోడు నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ జేరిపోతుల ధనంజయ గౌడ్ తదితరులు ఉన్నారు.