నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రేమికుల రోజును పురస్కరించుకొని కులాంతర, వివాహాలు చేసుకున్న జంటలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల రహిత సమాజం ఏర్పడాలంటే సమాజంలో అసమానత లు తొలగి పోవాలంటే కుల వివక్ష, అంటరానితనం ఉండకూడదన్నారు. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాలని, అలుపెరగని పోరాటం చేసి కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహం అందించే జీవో నెంబర్ 12 ను సాధించిన ఘనత కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘానిదన్నారు. అదేవిధంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు కెవిపిఎస్ అండగా ఉంటుందని పెళ్లి తో పాటు ప్రోత్సాహం కూడా అందే వరకు వారికి అండగా నిలబడతామన్నారు.