బడి బాట కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం: ఎంపీడీవో

నవతెలంగాణ – నెల్లికుదురు 

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈనెల మూడు నుండి చేపట్టనున్న బడిబాట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం జయప్రదం చేద్దామని ఎంపీడీవో బాలరాజు అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో శనివారం మండల విద్యాశాఖ ఐసిడిఎస్ ఐకెపి శాఖల సంయుక్తంగా బడిబాట సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల మూడు నుండి 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. సకల సౌకర్యాలు ప్రభుత్వ బడుల్లోనే ఉంటాయని అన్నారు అందుకోసం ప్రతి ఒక్కరం గ్రామాలలో తిరిగి ప్రతి ఒక్కరి విధిగా ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులను చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య ఉచిత సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రైవేటు బడులకు విద్యార్థులను తోలి తల్లిదండ్రులు  ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బడిబాట కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సిఆర్పిలు పంచాయతీ కార్యదర్శులు మహిళా సంఘాల వివో ఏలు ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ విధిగా భాగస్వాములై నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. బడిబాట కార్యక్రమం నిర్వహణపై నేడు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ రామ్దాస్ ఎంపీఓ పార్థసారథి ఏపిఎం వరదయ్య మండల వైద్యాధికారి వంశీకృష్ణ ఐసిడిఎస్ సూపర్వైజర్లు మల్లీశ్వరి నాగమణి ఉషారాణి తోపాటు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివో ఏలు మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎం సుధాకర్ సి ఆర్ పి లు డి రవి బి కవిత జె కవిత బి వీరస్వామి కంప్యూటర్ ఆపరేటర్ హెచ్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love