బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం

– సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి
 నవతెలంగాణ- వలిగొండ రూరల్:
మండలంలోని దుప్పల్లి గ్రామంలో నరిగే యాదయ్య  అధ్యక్షతన వలిగొండ మండల కౌన్సిల్ సమావేశం గురువారం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు,గృహలక్ష్మి, బిసి బంధు పథకాలతో ఈ మధ్యకాలంలో ప్రజలను   గ్రామంలో అయోమయానికి గురిచేసారని అన్నారు.  రానున్న శాసనసభ ఎన్నికలలో తిరిగి మూడోసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కలలు కంటుందని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు యువకులు మద్యానికి డబ్బులకు ప్రలోభాలకు గురి కాకుండా   చైతన్యవంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ 9 సంవత్సరాలు కాలంలో పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరుద్యోగి సమస్య వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదని ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలను నిలువు దోపిడి చేశారని అన్నారు. జిల్లాలోని సాగు, త్రాగునీరు సమస్యలు ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని అన్నారు.ఈ ఎన్నికలలో ఇలాంటి ప్రజావ్యతిరేకత కలిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులను ఈ ఎన్నికలలో ఓడించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, మండల కౌన్సిల్ సభ్యులు బాలగోని సత్యనారాయణ, సలిగంజి వీరస్వామి, ఏల్లంకి మహేష్, బలికే మొగులయ్య, బొడిగె సుదర్శన్, కట్ల యాదగిరి, సుద్దాల సాయికుమార్, చేగురి పాపయ్య, తాలూకా యాదగిరి,కోయగుర రాములు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love