16న దేశ వ్యాప్త సమ్మెతో కేంద్ర బీజేపీ, మోడీ విధానాలను తిప్పికొడదాం: సీఐటీయూ

– పశుమిత్ర యూనియన్ సమావేశం లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపు
నవతెలంగాణ – కంటేశ్వర్ 
ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెతో కేంద్ర బీజేపీ మోడీ విధానాలను తిప్పికొడదాం అని జిల్లా సీఐటీయూ కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ జిల్లా  కార్యాలయంలో పశుమిత్ర ముఖ్యుల  సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..గత పది సంవత్సరాలుగా కేంద్రం లో అధికారం లో ఎన్డీఏ నాయకత్వం లో ఉన్న బీజేపీ ,మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతాంగ,ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా దేశం ప్రమాదం లో పడిందని, దేశాన్ని రక్షించుకోవడం కోసమే ఫిబ్రవరి 16 న దేశ వ్యాప్త సమ్మె సమ్మె జరుగుతుంది. సంపద సృష్టికర్తలు గా ఉన్న కార్మికులు,రైతులు కలిసి చేస్తున్న సమ్మె గా ఈ సమ్మె ఉంటుందని, గ్రామీణ భారత్ బంద్ పేరుతో సంయుక్త కిసాన్ మోర్చ నాయకత్వం లో జరుగుతుందని, పారిశ్రామిక బంద్, సమ్మె ని కార్మిక వర్గం చేస్తున్నదని అన్నారు. సమ్మె దేశాన్ని రక్షించుకోవడం కోసం తప్ప జీత బత్యాల కోసం కాదని,దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ఉచితంగా దారాదత్తం చేస్తున్నారని, రూ.60 లక్షల కోట్ల రూపాయల జాతీయ సంపద ని 30 సంవత్సరాల పాటు అదానీ,అంబానీ లకు మోడీ కట్టబెట్టారని అన్నారు. దేశ ప్రజల పైన ధరల భారం వేస్తున్నారని,నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతున్నదని, ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్ముతున్నారని అన్నారు. ఈ ప్రధాన సమస్యలపై చర్చ జరగనివ్వకుండా మతం,కులం,ప్రాంతం పేరున విభజన కార్యక్రమానికి మోడీ పూనుకున్నారని అన్నారు.మహిళల పైన తీవ్రమైన దాడులు చేస్తున్నారని,చేస్తున్న వారంతా BJP,RSS కార్యకర్తలేనని,వీరిని అరెస్ట్ చేయడం కానీ,శిక్షించడం కానీ జరగడం లేదన్నారు.వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరిచే పని మోడీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలం లో చేసిందని కేరళ,తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న గవర్నర్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేఖంగా ఆందోళనలు చేస్తున్నారని,ఇటువంటి పరిస్తితి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల కాలం లో ఎప్పుడు లేదని అన్నారు. ప్రపంచం లో ఆకలి సుచిలో భారతదేశం 125 వ స్థానం లో ఉన్నదని,పౌష్ఠికాహారం లోపం తో చనిపోయే పిల్లల శాతం మన దేశం లోనే అత్యధికంగా ఉన్నదని అన్నారు. స్వాతంత్ర్య పోరాట కాలం లోనే సాధించుకున్న కార్మిక చట్టాలకు పాతరేసి నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చారని,ఈ లేబర్ కోడ్ ల ద్వారా పని గంటలు పెంచడం,సమ్మె చేసే హక్కు ను తొలగించడం,ఒక రోజు సమ్మె చేస్తే 8 రోజుల వేతనం కట్ చేయడం, ఇష్టారాజ్యంగా కార్మికులను తొలగించడం వంటి నిర్ణయాలను లేబర్ కోడ్ ల ద్వారా మోడీ ప్రభుత్వం కార్మికులను బానిసత్వం లోకి నెడుతున్నారని అన్నారు.దేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం అత్యంత వేగంగా మోడీ ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు. రైతాంగానికి ఉనికి కే నష్టం చేసే మూడు నల్ల వ్యవసాయ చట్టాలను సుదీర్ఘ పోరాటం వల్ల రద్దైనా,దొడ్డి దోవన అమలు చేస్తున్నారని, రైతాంగ భూములను కార్పొరేట్ లకి అప్పగించే పని చేస్తున్నారని, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించడం లేదని,ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. పదేళ్ల మోడీ పాలన  లో కార్పొరేట్. మత విధానాలను అమలు చేస్తూ,దేశాన్ని అత్యంత ప్రమాదం లోకి తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ దుర్మార్గ విధానాల నుండి దేశాన్ని రక్షించుకోవడానికి ఫిబ్రవరి 16 న దేశ వ్యాప్త సమ్మె చేస్తున్నామని,ఈ సమ్మె తో దేశాన్ని రక్షించుకుందాం. ఈ సమ్త్ర కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. మిత్ర జిల్లా అధ్యక్షురాలు మౌనిక జిల్లా ఉపాధ్యక్షులు మమత నాగమణి రమ్య లక్ష్మి గంగామణి విజయ తదితరులు పాల్గొన్నారు.
Spread the love