కారు గుర్తుకు ఓటు వేద్దాం.. హ్యాట్రిక్ విజయం సాధిద్దాం

నవతెలంగాణ- తిరుమలగిరి: తుంగతుర్తి నియోజకవర్గం లో ఆరు దశాబ్దాలలో జరగని అభివృద్ధి కేవలం దశాబ్ద కాలంలోనే చేసి చూపించి అభివృద్ధిని సమృద్ధిగా అందించిన ఉస్మానియా యువ కెరటం తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ కారు గుర్తుకు ఓటేసి యాట్రిక్ విజయం సాధించుకునే దిశగా నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి మరోసారి తుంగతుర్తి గడ్డపై గులాబీ జెండా ఎగురవేసి విజయ డంఖా మోగించాలని తిరుమలగిరి మండల గ్రంధాలయ చైర్మన్ మోడెపు సురేందర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంతో అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి జననేతగా ఎదుగుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కార్యకర్తలను నాయకులను ఆదుకుంటూ పార్టీ పటిష్టత కోసం నిరంతర కృషి చేయడంతో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ని మహా వృక్షం లాగా తయారుచేసి వృక్షం కింద లక్షలాది మంది సుఖ జీవనం సాగించేలాగా తయారు చేసినారని ఆయన అన్నారు. 9 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినారని, గ్రామాల తండాల రూపురేఖలు మార్చారని, ఏళ్ల తరబడి బీడు గా ఉన్న భూములకు కాలేశ్వరం, గోదావరి నీళ్లు అందించి సస్యశ్యామలం చేసి లక్ష ఎకరాలను సాగులోకి తీసుకువచ్చారని అన్నారు. చిన్న, పెద్ద, పాత, కొత్త తరం వాళ్లను కలుపుకూ పోతూ విమర్శలకు తావు లేకుండా నిత్యం ప్రజల్లో ఒకరిగా ఉంటూ సమస్యలను ప్రత్యక్షంగా చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో యువత చూపు యువకిశోరం వైపు అడుగులు వేస్తూ అభివృద్ధికి ఆకర్షితులై ఆయన వైపు నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కళ్యాణ లక్ష్మి, పల్లె దావకానాలు, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా కోట్ల రూపాయల సాయం, సబ్ స్టేషన్లు, కెసిఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, సీఎంఆర్ఎఫ్ నిధులు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, గురుకులాల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, మున్సిపాలిటీల ఏర్పాటు, కమ్యూనిటీ భవనాలు, దళిత బంధు, బీసీ బందు లాంటివి నియోజకవర్గంలో ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాల కింద 2168.00 కోట్లు,  సంక్షేమ పథకాల ద్వారా 3473.73 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేసి నియోజకవర్గంలో మొత్తంగా 5641.73 వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసి మునుపెన్నడూ లేని విధంగా పరిపాలన సాగించి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ తుంగతుర్తి అనే విధంగా చేసి చూపించారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ కారు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.

Spread the love