ప్రమాద భరితంగా మారిన కొత్తపేట లో లెవెల్ బ్రిడ్జ్, రోడ్డు..

నవతెలంగాణ- జన్నారం
జన్నారం మండల కేంద్రంలోని కొత్తపేట గ్రామానికి వెళ్ళే రహదారి భారీ వర్షాల నేపథ్యంలో లో లెవెల్ బ్రిడ్జి పూర్తిగా చెడిపోయింది. రోడ్డు పరిస్థితి ప్రమాద భరితంగా మారింది.రెండు,మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా జన్నారం మండలానికి వెళ్లాల్సిన దారి తెగిపోయింది.దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మండలంలోని కొత్తపేట గ్రామ నుంచి కవ్వాల్ ,జన్నారం వెళ్ళే ప్రధాన రహదారి తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ దారి వెంట వాహనాలు నడుస్తూ ఉంటాయి. వర్షాకాలం వచ్చింది అంటే చాలు ఆ గ్రామానికి వెళ్ళడానికి పొరుగు గ్రామాల వారికి కూడా కష్టం అవుతుంది.గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. 108 వాహనం కూడా పోలేని దుస్థితి నెలకొంది  ఆటోలలో వెళ్లే  గర్భిణీ స్త్రీలకు  చాల ఇబ్బంది ఏర్పడుతుంది.ప్రభుత్వాలు మారుతున్న కూడా ఈ రోడ్డుకు తగిన పరిష్కారం చేయట్లేదు. ఏ నాయకులు వచ్చిన ఈ బ్రిడ్జి పూర్తి చేసే బాధ్యత మాది అని కొబ్బరికాయలు కొట్టి వెళ్ళడం తప్ప చేసింది ఐతే ఏమి లేదు అని గ్రామస్తులు వాపోతున్నారు.పై అధికారులు అలాగే ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడమ బొజ్జు స్పందించి తక్షణమే ఈ దారికి బ్రిడ్జి కట్టించి మెరుగు పరచాలని యూత్ సభ్యులు,తొట్ల శ్రీకాంత్ యాదవ్,సంకోజ్ అరుణ్,బలవత్తుల వినీత్,పూదరి మహేష్ గ్రామ ప్రజలు తదితరులు ఈ రొడ్డును బాగు చేయించాలని బ్రిడ్జి వేయించాలని కోరుకుంటున్నారు

Spread the love